మన భారతీయులకు
త్వరలోనే కుల ప్రమానిక “Cast-based” రిజర్వేషన్ నుంచి కూడా స్వాతంత్య్రం రావాలని,
ప్రభుత్వ సహయం పొందడానికి పేదవాడికి కులం అడ్డు రాకూడదని, ప్రతిభకు తగ్గ ఉపాధి
రావడానికి కులం,డబ్బు అడ్డు రావద్దని, మన దేశంలో ప్రాంతీయ, కుల, మత, పార్టీ, ఇంకా
ఏ విభేదాలు రావద్దని, హింసను హింసతో కాకుండా, శాంతితో జయించాలని, ప్రతి ఒక్కరు ఎదుటి
వారి ఎదుగుదల చూసి అసూయ బదులుగా ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవాలని, ప్రతి భారతీయుడికీ
ఇంద్రియ నిగ్రహం అలవడాలని, జగతికి స్త్రీ, పురుషులంటే పక్షికి రెండు రెక్కల వంటి
వారని అందరు భావించాలని, అవినీతి,హింస,అరాచకాలు పోయి నిజాయితీ,సత్యం,అహింసలు అందరి
ఆయుదాలు కావాలని, మన దేశానికి కావలసిన ప్రతి వస్తువూ మన దేశంలోనే ఉత్పత్తి
కావాలని, భారత తయారీ అని గర్వంగా చెప్పే రోజు రావలని, విదేశంలో వున్నా అని ఎంత
గర్వంగా చెప్తున్నారో అంతకు పదింతలు గర్వంగా నా దేశంలో వున్నా అని చెప్పుకొనే రోజు
రావలని, అన్నిటికంటే ఎక్కువగా మంచి,సాహయం,క్షమ గుణాలకి గుర్తింపు రావాలని కోరుతూ,
అందరికీ మరొక్కసారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంశలు. – హరీష్.అర్వపల్లి